దేశంలో 2,503 కరోనా కొత్త కేసులు నమోదు

Telugu Lo Computer
0


దేశంలో తాజాగా 2 వేల 503 కరోనా కేసులు నమోదయ్యాయని, 27 మంది వైరస్ బారిన పడి చనిపోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరోవైపు కరోనా వైరస్ వెలుగు చూసిన చైనాలో గత పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోసారి వైరస్ కేసులు భారీగా వెలుగు చూస్తున్నాయి. కోవిడ్ – 19 కేసుల్లో దేశంలోని రెండు అతిపెద్ద నగరాలైన షెన్ జాన్, షాంఘై వైరస్ లు వ్యాపించడంతో కఠినమైన ఆంక్షలు విధించాయి. మరోసారి కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ విధిస్తున్నారు. రోజురోజుకూ కేసులు పెరుగుతుండడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. చైనా చాంగ్‌చున్‌లో కరోనా విజృంభిస్తోంది. 90 లక్షల జనాభా ఉండే చాంగ్‌చున్‌లో దాదాపు 4 వందల కేసులు నమోదయ్యాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు చాంగ్‌చున్‌లో లాక్‌డౌన్‌ విధించారు. గత రెండు రోజుల నుంచి అధికారులు కఠినంగా లాక్‌డౌన్‌ అమలు చేస్తున్నారు. ఇక చైనాలో శనివారం 15 వందల కొత్త కేసులు నమోదయ్యాయి. 2020 తర్వాత అత్యధికంగా కేసులు నమోదవ్వడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)