వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన టిప్స్! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 15 February 2022

వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన టిప్స్!


వాలెంటైన్స్ డే సందర్భంగా ఉపాసన కొన్ని వ్యాఖ్యలు చేసింది. పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయిస్తారనేది నిజం కాదు… అంటూ వాలంటైన్స్‌ డే రోజు ఆసక్తికరమైన వీడియోను షేర్ చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ భార్య ఉపాసన ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారారు. బ్యాలెన్స్ డే అనగానే చాలామంది తమ ప్రేమికులకు ఖరీదైన బహుమతులు ఇవ్వడం, అలాగే వారికి ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలను సడన్ గా తెలియజేసి వారిని ఆనందానికి గురి చేయడం చేస్తూ ఉంటారు. మరికొంత మంది సెలబ్రిటీలు వారి ప్రేమికులను సడన్ సర్ ప్రైజ్ లను ఇచ్చి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఉపాసన తమ వివాహ బంధానికి 10 ఏళ్లు అయిందనే విషయాన్ని తెలుపుతూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ చేసి ప్రేమ గొప్పతనం గురించి చెప్పుకొచ్చింది. భార్యాభర్తల అన్యోన్యత అనుబంధం కలకాలం కలిసి ఉండాలంటే ఏం చేయాలో అనే దాని గురించి కొన్ని టిప్స్ తెలియజేసింది. నేను చరణ్ వివాహం చేసుకొని 10 ఏళ్లు పూర్తయింది. ప్రేమికుల రోజు అనేది ఎప్పుడూ ప్రత్యేకమే. మీరు ప్రేమించిన వ్యక్తులతో అన్యోన్యంగా కలిసి ఉండాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే ఉపాసన కొన్ని టిప్స్ ను తెలియజేస్తుంది. వివాహ బంధంలో ఆరోగ్యానికి ప్రథమ స్థానం ఉంటుంది కాబట్టి ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఉదయాన్నే నిద్ర లేవాలి. ఫిట్నెస్ గా ఉండాలి. మిమ్మల్ని ఇష్టపడే వారికోసం కొంత సమయాన్ని కేటాయించాలి అని ఉపాసన తెలియజేసింది.

No comments:

Post a Comment