"క్వాడ్ కూటమిని" నడిపిస్తుంది ఇండియానే! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 15 February 2022

"క్వాడ్ కూటమిని" నడిపిస్తుంది ఇండియానే!


“క్వాడ్ లేదా క్వాడ్రిలేటర్ సెక్యూరిటీ డైలాగ్” కూటమిని భారత దేశం ముందుండి నడిపిస్తుందని అమెరికా శ్వేతసౌథం వర్గాలు ప్రశంసించాయి. ఇటీవల ఆస్ట్రేలియాలోని మెల్ బోర్న్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా క్వాడ్ సభ్య దేశాల ప్రతినిధులు, రాయబారులు సమావేశం అయ్యారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనాను అస్థిరపరిచే చర్యలు మరియు ఉక్రెయిన్ లో రష్యన్ దురాక్రమణ గురించి సభ్యదేశాలు చర్చించాయి. దక్షిణాసియా ప్రాంతంలో శాంతిని కాంక్షించేందుకు భారత్, అమెరికా, జపాన్ మరియు ఆస్ట్రేలియా దేశాలు “క్వాడ్ కూటమి”గా ఏర్పడిన సంగతి తెలిసిందే. మెల్బోర్న్ సమావేశం అనంతరం అమెరికా వైట్ హౌస్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కరీనా జీన్-పియర్ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దక్షిణాసియాలో క్వాడ్ ను నడిపించేందుకు భారత్ చోదకశక్తిగా పనిచేస్తుందని ప్రశంసించారు. అంతర్జాతీయంగా భారత్ తో విదేశాల సత్సంబందాలపై ఇటీవల రాహుల్ గాంధీ పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపగా శ్వేతసౌథం చేసిన ప్రకటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. మెల్బోర్న్ సమావేశం సందర్భంగా అమెరికా విదేశాంగ మంత్రి టోనీ బ్లింకెన్, భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చర్చల్లో పాల్గొన్నారు. ఈసంధర్భంగా జరిగిన చర్చల సారాంశాన్ని వైట్ హౌస్ ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రెస్ సెక్రటరీ కరీనా జీన్-పియర్ మీడియాకు వెల్లడించారు. దక్షిణాసియా మరియు హిందూ మహాసముద్రం ప్రాంత పరిధిలో భారత్ ఒక శక్తిగా ఎదుగుతున్న విషయాన్ని తాము గ్రహించామని, అమెరికా, ఇతర క్వాడ్ దేశాల వలె భారత్ కూడా భావసారూప్య భాగస్వామిగా గుర్తించామని అమెరికా తెలిపింది. క్వాడ్ దేశాలతో కలిసి దక్షిణాసియాలో స్థిరత్వం, ప్రాంతీయ అభివృద్ధి కోసం భారత్ చురుకుగా పనిచేస్తుందని అమెరికా ప్రతినిధి వివరించారు. రష్యా – యుక్రెయిన్ వ్యవహారం గురించి కూడా మెల్బోర్న్ శిఖరాగ్ర సదస్సులో చర్చించడం శుభపరిణామని.. అందరు కలిసికట్టుగా రష్యా మనసు మార్చే ప్రయత్నం చేస్తున్నట్లు కరీనా జీన్-పియర్ పేర్కొన్నారు. రానున్న రోజుల్లోనూ అమెరికా – భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత దృఢపరుచుకుని, ఆరోగ్యం, అంతరిక్షం, సైబర్‌స్పేస్ వంటి కొత్త రంగాల్లో ఆర్థిక మరియు సాంకేతిక సహకారాన్ని మరింత ఇచ్చిపుచ్చుకుంటామని కరీనా జీన్-పియర్ తెలిపారు.

No comments:

Post a Comment