యాలుకలు - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


అత్యద్భుత ఔషద గుణాలు కలిగిన వాటిలో యాలుకలు ఒకటి. మన వంటింట్లో దొరికే ఈ యాలుకలను పెద్దగా మనం పట్టించుకోం. ఏదో మంచి వాసన కోసం వాడుతుంటారు గానీ అసలు యాలుకల విలువ చాలామందికి తెలియదు. ఆయుర్వేద వైద్యంలో ఈ యాలుకలను అనాదిగా వాడుతూ వస్తున్నారు. బామ్మ వైద్యానికి దూరమైన నేటి తరం వీటిని పెద్దగా పట్టించుకోదు. కానీ.. శరీరానికి అల్లం ఎంత మేలు చేస్తుందో యాలుకలు కూడా అంతే ఆరోగ్యాన్ని అందిస్తాయట. దీర్ఘకాలిక వ్యాధులైన మధుమేహం, ఆస్తమా, హృద్రోగ సమస్యలతో బాధపడేవారికి యాలుకలు ఎంతో ఉపయోగపడతాయట. అంతేకాదు.. మానసిక సమస్యలతో బాధపడే వారిని ఆ స్థితి నుంచి బయటపడేసేందుకు కూడా ఈ సుగంధ ద్రవ్యం పనికొస్తుందట. వాతావరణంలో మార్పుల కారణంగా వచ్చే సీజనల్ అనారోగ్య సమస్యలైన దగ్గు, జలుబు, జ్వరం వంటి వాటిని నయం చేసేందుకు హోం రెమిడీలో భాగంగా యాలుకలను వాడితే ఎంతో ప్రయోజనం ఉంటుందట. వాంతులు, వికారంగా ఉండటం వంటి సమస్యల నుంచి యాలుకలతో ఉపశమనం లభిస్తుందట. శరీరం లోపల ఆరోగ్యానికి హాని చేసే బ్యాక్టీరియాతో పోరాడి అనారోగ్య సమస్యలను తప్పించడంలో యాలకుల సమర్థవంతంగా పనిచేస్తాయట. ఒబెసిటీ, అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్ సమస్యలు ఉన్నవారు యాలుకలను తీసుకోవడం మంచిదట. నోటి దుర్వాసన, దంత సమస్యల నుంచి బయటపడేయటమే కాకుండా.. చిగుళ్లను బలంగా ఉంచడంలో యాలుకలు ప్రధాన పాత్ర పోషిస్తాయట. కేవలం.. ఇవి మాత్రమే కాదు.. శృంగారపరమైన సమస్యలతో బాధపడేవారికి యాలుకలు దివ్య ఔషధమని ఆయుర్వేదం చెబుతోంది. కొందరు పురుషుల్లో సహజంగా ఉండే సెక్స్ సమస్య ఎక్కువ సేపు చేయలేకపోవటం. ఇలాంటి వారు భార్యను సంతృప్తిపరచలేక.. ఆ సమస్యను ఎవరితో చెప్పుకోలేక తమలో తాము మదనపడిపోతుంటారు. అలాంటి వారికి యాలుకలు వర ప్రదాయిని అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. శృంగార సమస్యలతో సతమతమవుతున్న పురుషులు గనుక పడుకునే ముందు రోజుకు రెండు యాలుకలను తింటే ఆ తర్వాత నుంచి వారి దాంపత్య జీవనం సుఖమయంగా మారిపోతుందని.. ఎంతో హాయిగా భాగస్వామిని సంతృప్తిపరచవచ్చని అంటున్నారు. అంతేకాదు.. సెక్స్ సమస్యలతో బాధపడే పురుషులు యాలుకల నూనెను వాడితే ఎంతో ప్రయోజనం ఉంటుందట. అయితే.. ఇన్ని ప్రయోజనాలున్న యాలుకలను నేరుగా తీసుకోవడం కొంచెం కష్టంగా అనిపించినా ఇలాచీ టీ రూపంలో తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)