హిజాబ్ వివాదంపై బీజేపీ నేతలకు అధిష్ఠానం ఆదేశాలు

Telugu Lo Computer
0


కర్ణాటక విద్యా సంస్థల్లో హిజాబ్ వివాదం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి, స్థానిక బీజేపీ నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం స్పష్టమైన ఆదేశాలిచ్చింది. బీజేపీ ముస్లిం మహిళలకు వ్యతిరేకం కాదని సంబంధితులందరికీ స్పష్టంగా తెలియజేయాలని తెలిపింది. వస్త్ర ధారణకు సంబంధించిన నిబంధనలను ఆయా విద్యా సంస్థలకే వదిలిపెట్టినట్లు వివరంగా చెప్పాలని తెలిపింది. బీజేపీ ఎమ్మెల్యేలు కొందరు ఈ వివరాలను స్థానిక మీడియాతో పంచుకున్నారు. హిజాబ్ వివాదంపై సంయమనం పాటించాలని తమను తమ పార్టీ అధిష్ఠానం ఆదేశించిందని బీజేపీ ఎమ్మెల్యేలు చెప్పారు. పార్టీ ఎన్నికల విజయావకాశాలు దెబ్బతినకుండా జాగ్రత్తవహించాలని కోరినట్లు తెలిపారు. ఈ వివాదం సద్దుమణగడానికి కృషి చేయాలని తెలిపినట్లు చెప్పారు. మంగళూరు సిటీ బీజేపీ ఎమ్మెల్యే భరత్ షెట్టి మాట్లాడుతూ, హిజాబ్ వివాదం నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై తమ పార్టీ అధిష్ఠానం తమకు ఓ సలహా ఇచ్చిందని తెలిపారు. అయితే దీనిపై నిర్దిష్ట సూచనలేవీ చేయలేదన్నారు. సంబంధితులందరి వద్దకు వెళ్ళాలని, వారిని విశ్వాసంలోకి తీసుకోవాలని చెప్పినట్లు తెలిపారు. విద్యా సంస్థల యాజమాన్యాలు, కమ్యూనిటీ సభ్యులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులతో స్థానికంగా సమావేశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)