నేటి నుంచి సమతా మూర్తి దర్శనం

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ శ్రీ రామ నగరంలో సమతా మూర్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. దాదాపు 12 రోజుల పాటు సమతా మూర్తి రామానుజాచార్యుల సహస్రాబ్ధి ఉత్సవాలు నిర్వహించారు.ఈ ఉత్సవాలు ముగియడంతో నేటి నుంచి సామాన్యులకు సమతా మూర్తి దర్శనం ఇవ్వనున్నారు. రోజుకు నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి నిర్వహకులు అనుమతి ఇవ్వనున్నారు. సాధారణ ప్రవేశ్ రుసుంతో దర్శనం ఉంటుందని నిర్వహకులు తెలిపారు. ఇటీవల జరిగిన సహస్రాబ్ది ఉత్సవాలు 24 గంటలు ప్రవేశానికి అనుమతి ఉండేది. కానీ ప్రస్తుతం రోజుకు నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంటుందని తెలిపారు. సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు మాత్రమే సందర్శకులకు అనుమతి ఉంటుందని నిర్వహకులు తెలిపారు. అలాగే ఈ నెల 19వ తేదీన 108 ఆలయాల్లో జరగబోయే కళ్యాణ మహోత్సవం వరకు సువర్ణ మూర్తి విగ్రహంతో పాటు త్రీడీ షోలను కూడా తాత్కాళికంగా మూసివేస్తున్నట్టు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)