బప్పీలహరి కన్నుమూత

Telugu Lo Computer
0


సంగీత దర్శకుడు బప్పి లహిరి (69) ముంబైలోని క్రిటికేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.  నెల రోజుల క్రితం అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ఈ మధ్యే డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆయన ఆరోగ్యం మంగళవారం ఒక్కసారిగా విషమించడంతో కుటుంబసభ్యులు డాక్టర్ ను ఇంటికి పిలిపించారు. డాక్టర్ సూచన మేరకు లహిరిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. పరిస్థితి విషమించడంతో అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియాతో చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. బాలీవుడ్ సహా టాలీవుడ్ సినిమాలకు కూడా ఆయన సంగీతమందించారు. తెలుగులో సింహాసనం, గ్యాంగ్ లీడర్, సామ్రాట్, రౌడీ అల్లుడు, రౌడీ ఇన్ స్పెక్టర్ సినిమాలకు సంగీతమందించారు. హిందీ, కన్నడ, తెలుగు, తమిళ్, కన్నడ భాషలలో పనిచేశారు. సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన రియాలిటీ షో బిగ్ బాస్ 15 లో బప్పి చివరిసారిగా కనిపించారు. బప్పీ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తో పాటు, బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్, లైఫ్ టైం అఛీవ్ మెంట్ అవార్డును కూడా అందుకున్నారు. డర్టీ పిక్చర్ సినిమాలోని ఊలా.. ఊలాలా పాటకు గాను బెస్ట్ ఐటం సాంగ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును గెలుచుకున్నారు. బప్పి లహిరి గత ఏడాది ఏప్రిల్ లో కరోనా బారినపడ్డారు. ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు.

Post a Comment

0Comments

Post a Comment (0)