సముద్రంలో కూలిన అమెరికా విమానం

Telugu Lo Computer
0


అమెరికా ఉత్తర కరోలినాలో ఎనిమిది మందితో ప్రయాణిస్తున్న చిన్నపాటి విమానం అట్లాంటిక్ మహా సముద్రంలో కూలిపోయింది. అమెరికా ఉత్తర కరోలినా రాష్ట్రం ఔటర్ బ్యాంక్స్ సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. ఇప్పటివరకు ఒక మృతదేహం లభించగా, మిగిలిన వారి కోసం సహాయక సిబ్బంది విస్తృతంగా గాలిస్తున్నారు. పిలాటస్ పీసీ-12/47 సింగిల్ ఇంజిన్ విమానం.. సోమవారం మధ్యాహ్నం 1.35కు (స్థానిక కాలమానం ప్రకారం) హైడ్ కౌంటీ ఎయిర్​పోర్ట్ నుంచి టేకాఫ్​ అయినట్లు సమాచారం. 2 గంటలకల్లా ఆ విమానం రాడార్​ నుంచి మాయమైంది. విమానం సముద్రంలో కూలిపోయిందని నిర్ధరించుకున్న కోస్ట్ గార్డ్  వెంటనే సహాయక చర్యలు చేపట్టింది. పడవలు, హెలికాప్టర్లను రంగంలోకి దించింది. సముద్రంలో మూడు వేర్వేరు చోట్ల విమాన శకలాలు పడి ఉండడాన్ని కోస్ట్ గార్డ్ గుర్తించింది. అక్కడే ఒక మృతదేహాన్ని గుర్తించింది. విమానం ప్రధాన భాగం ఇంకా కనిపించలేదని, గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ఎవరూ బతికి బయటపడే అవకాశాలు కనిపించడం లేదని చెప్పారు. ప్రయాణికులంతా కార్​టెరెట్ కౌంటీకి చెందినవారని, కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చామని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)