ఎలాన్ మస్క్ భారీ విరాళం ! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 15 February 2022

ఎలాన్ మస్క్ భారీ విరాళం !


ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్​ తను ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని గతంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే ఇచ్చిన పిలుపు మేరకు సుమారు 5 మిలియన్​ టెస్లా షేర్లను విరాళంగా ఇచ్చారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌లో దాఖలు చేసిన వివరాల ప్రకారం.. నవంబర్ 19 నుంచి నవంబర్ 29 వరకు తన వాటాలో నుంచి ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన 5 మిలియన్లకు పైగా షేర్లను విరాళంగా ఇచ్చినట్లు పేర్కొన్నారు. మస్క్​ ఇచ్చిన ఈ విరాళం విలువ సుమారు 5.7 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 43 వేల కోట్లు) ఉంటుందని అంచనా. ఇప్పటి వరకు ఇచ్చిన ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విరాళాల్లో ఈ విరాళం ఒకటిగా నిలవనుంది. అయితే విరాళంగా ఇచ్చిన ఈ మొత్తాన్ని ఏ స్వచ్ఛంద సంస్థకు ఇచ్చారు అనే దానిపై ఇంకా స్పష్టత లేదు. నియంత్రణా సంస్థలకు ఇచ్చిన సమాచారంలో కూడా ఆ ట్రస్ట్​ వివరాలు పొందుపరచలేదు. మస్క్ వంటి బిలియనీర్లు "ఒక్కసారి తలచుకుంటే" కోట్ల మంది నిరుపేదల ఆకలి బాధలు తీర్చేయొచ్చని ఐక్యరాజ్యసమితి వరల్డ్‌ ఫుడ్‌ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డేవిడ్‌ బేస్లే గతంలో అన్నారు. ప్రపంచంలో సుమారు 4.2 కోట్ల మంది ఆకలి తీర్చేందుకు 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ.45,000 కోట్లు) అవసరమని గతంలో ట్వీట్​ చేశారు. ఈ విషయంపై స్పందించిన మస్క్​ నిరుపేదల ఆకలి బాధల నిర్మూలనపై మీ ప్రణాళికేంటో చెబితే, నిధులు ఎలా సద్వినియోగం చేస్తారో వెల్లడిస్తే.. 6 బిలియన్‌ డాలర్ల విలువైన షేర్లను ఇప్పటికిప్పుడు విక్రయించి, ఐక్యరాజ్యసమితి ఫుడ్‌ ఏజెన్సీకి ఇచ్చేందుకు తాను సిద్ధమేనని గతంలో అన్నారు. అప్పుడు ఇచ్చిన మాట మేరకు మస్క్ తన కంపెనీ షేర్లను విరాళంగా ఇచ్చారు​.

No comments:

Post a Comment