గుడి తలుపులు ఏడాదిలో 5 గంటలపాటే...!

Telugu Lo Computer
0


ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్‌ జిల్లా కేంద్రానికి 12 కిలోమీటర్ల దూరంలో కొండపై ఉన్న నీరయ్‌ మాతా దేవాలయం ఒకటి ఉంది. ఈ ఆలయంలోని నీరయ్‌ మాతా కేవలం ఛైత్ర నవరాత్రి రోజున తెల్లవారుజామున 4 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు భక్తులకు దర్శనం ఇస్తుందట. అందుకే, ఆ రోజున వేల సంఖ్యలో భక్తులు ఈ ఆలయానికి పొటెత్తుతారు. అయితే, ఇక్కడ పూజా విధానమంతా వేరుగా ఉంటుంది. సాధారణంగా అన్నీ దేవాలయాల్లో అర్చనలకు ఉపయోగించే కుంకుమ, తేనె, అలంకరణ వస్తువులేవి ఇక్కడ ఉపయోగించరట. కేవలం కొబ్బరికాయ కొట్టి అగరబత్తులు వెలిగిస్తే చాలు మాతకు పూజలు చేసినట్లే. ఆ ఐదు గంటలు దాటిన తర్వాత ఆలయంలోకి భక్తులను అనుమతించరు. తిరిగి మరుసటి ఏడాది ఛైత్ర నవరాత్రి వచ్చేదాక ఆలయంలోకి ఎవరూ రాకూడదని నిబంధనలు ఉన్నాయి.. అలాగే ఈ గుడిలోకి మహిళల ప్రవేశంపై కూడా నిషేధం ఉంది. అంతేకాదు.. ఈ దేవాలయంలో పంచిన ప్రసాదాన్ని మహిళలు తినకూడదట. తింటే చెడు జరుగుతుందని అక్కడి వారి గట్టి విశ్వాసం. చైత్ర నవరాత్రుల ప్రారంభంలో నీరయ్‌ మాతా ఆలయంలోని దీపం దానికదే వెలుగుతుందట. నూనె లేకున్నా.. తొమ్మిది రోజులపాటు దీపం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉంటుందని స్థానికులు అంటున్నారు. దీని వెనుకన్న రహస్యాన్ని మాత్రం ఇప్పటివరకూ ఎవరూ కనిపెట్టలేకపోతున్నారు. అయితే ఈ ఆలయాన్ని ఎందుకు ఇలా 5 గంటలు పాటే తెరుస్తున్నారు, మహిళలను ఎందుకు అనుమతించటం లేదు, దీపం అలా ఎవరూ వెలిగించకుండా వెలగటం వెనుకు ఏదైనా సైన్స్ కు సంబంధించిన కారణం ఉందా అనేది ఇంతవరకూ ఎవరూ చెప్పలేకపోయారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)