భార్యను హత్య చేసిన భర్త !

Telugu Lo Computer
0


విజయనగరం జిల్లా కొత్తవలస మండలం అప్పన్నదొరపాలెం పంచాయతీ జోడిమెరక గ్రామానికి చెందిన గిరిజనుడు జోడు నాగరాజు (33) భార్య లక్ష్మిని తానే హత్య చేసినట్లు పోలీసుల ముందు అంగీకరించాడు. తెర్లాం మండలం ఉద్దవోలుకు చెందిన లక్ష్మిని ఎనిమిదేళ్ల క్రితం నాగరాజు ప్రేమ వివాహం చేసుకున్నాడు. వారిద్దరికీ బాబు యశ్వంత్‌ (7) ఉన్నాడు. చెడు వ్యసనాలకు అలవాటు పడిన నాగరాజు ఆమెను తరచూ వేధిస్తూ వివాహేతర సంబంధాలు అంటగడుతూ అదే గ్రామానికి చెందిన వరసకు మేనకోడలైన  మౌనికతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తలు నిత్యం గొడవలు పడుతుండడంతో గ్రామస్తులు పలుమార్లు పంచాయితీ నిర్వహించి నాగరాజును మందలించారు. భార్య లక్ష్మి అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న నాగరాజు జనవరి 28న రాత్రి 7.30గంటల సమయంలో లక్ష్మి స్వీట్‌ షాప్‌లో విధులు ముగించుకుని వస్తుండడంతో దారిలో కాపుకాసి తీర్థానికి రావాలని అడిగాడు. దీంతో నమ్మిన ఆమె భర్త స్కూటీ ఎక్కింది. తొలుత ఏపీ మోడల్‌స్కూల్‌ వైపు తీసుకువెళ్లగా అనుమానం వచ్చి బండిపై నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేసింది. తిరిగి ఆమెను స్కూటీపై ఎక్కించి బలిఘట్టం రెవెన్యూ పరిధిలోగల అర్ధాన్నపాలెం దారిలో జీడి తోటలోకి తీసుకువెళ్లి తనకు విడాకులు ఇవ్వాలని నాగరాజు కోరగా ఆమె తిరస్కరించడంతో బలంగా తోసేశాడు. దీంతో ఆమె రాళ్లకుప్పపై పడి స్పృహ కోల్పోయింది. అదే అదునుగా రాయితో ఆమె తలపై కొట్టి హత్యచేసి అనంతరం ఎవరికీ అనుమానం రాకుండా పక్కనే ఉన్న గోతిలో వేసి ఎండు పుల్లలు వేసి పెట్రోల్‌ పోసి తగుల బెట్టినట్లు నిందితుడు వాంగ్మూలంలో చెప్పాడు. 


Post a Comment

0Comments

Post a Comment (0)