చిల్ బ్లెయిన్ వ్యాధి - జాగ్రత్తలు !

Telugu Lo Computer
0


చలికాలంలో జలుబు, దగ్గు మాత్రమే కాదు కొన్ని కొత్త వ్యాధులు కూడా ఏర్పడుతాయి. వీటికి తక్షణ చికిత్స అవసరం లేదంటే వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. చలికాలంలో తరచుగా చిల్ బ్లెయిన్ అనే వ్యాధి వస్తుంది. శీతాకాలంలో చల్లని గాలికి గురికావడం వల్ల చేతులు, కాళ్ళలో వాపులు, శరీరంలోని చిన్న రక్త నాళాలు చిట్లడం జరుగుతుంది. దీనినే చిల్ బ్లెయిన్ అంటారు. దీని కారణంగా వేళ్లు, కాళ్లు అనేక సందర్భాల్లో చెవి దిగువ భాగం ఎర్రగా మారి వాపులు ఏర్పడుతాయి. నడవలేని పరిస్థితులు ఏర్పడుతాయి. చేతులు, కాళ్లు, బుగ్గలపై అకస్మాత్తుగా తీవ్రమైన దురద, వెచ్చదనం లేదా మంటగా ఉంటే చిల్‌ బ్లెయిన్‌ వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. సున్నితమైన చర్మంపై తీవ్రమైన చలి తర్వాత వేడి కారణంగా ఎక్కువగా ఈ రకమైన సమస్య ఏర్పడుతుంది. ఇలా జరిగినప్పుడు గోళ్లతో గోకడం కాకుండా క్లాత్‌తో రుద్దాలి. అలాగే కొంతమంది వేడితో కాపడం లాంటివి చేస్తారు ఇలా చేయకూడదు. సమస్య తీవ్రమవుతుంది. ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు చేతులకు గ్లౌజులు, పాదాలకు సాక్స్ ధరించాలి. మహిళలు ఇంట్లో సాక్స్ ధరించడంతోపాటు క్లాత్ షూస్ ఉపయోగించాలి. చల్లని నీటికి చేతులు, కాళ్ళను దూరంగా ఉంచాలి. వీలైనంత వరకు చలికి దూరంగా ఉండాలి. అవసరమైనప్పుడు మాత్రమే ఇంటి నుంచి బయటికి వెళ్లాలి. దీని నుంచి ఉపశమనం కోసం వేడి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి చేతులు, కాళ్ళను నానబెట్టాలి. సమస్య తీవ్రంగా ఉంటే ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)