ఊ అంటావా సాంగ్‌కి శ్రద్ధా దాస్ స్టెప్పులు!

Telugu Lo Computer
0


అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన పాన్ ఇండియా చిత్రం పుష్ప. ఈ సినిమాకి దేశ విదేశాల నుండి మంచి ఆదరణ దక్కుతుంది. ఈ సినిమాలోని పాటలకు ప్రతి ఒక్కరు తమదైన శైలిలో స్టెప్పులు వేసి అలరిస్తున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ బుట్టబొమ్మ సాంగ్ ప్రపంచ వ్యాప్తంగా ఎంతమందిని అలరించిందో తెలిసిందే. ఇప్పుడు ఈ క్రెడిట్ మళ్ళీ బన్ని మువీలోని సమంత ఊ అంటావా మావా సాంగ్ దక్కించుకుంది. ఊ అంటావా మావా అంటూ ఈ చెన్నై సోయగం చేసిన డ్యాన్స్ అనేక దేశాల వారి అభిమానాన్ని సొంతం చేసుకుంది. అవును ఊ అంటావా మావా ఊఊ అంటావా మావా.. అంటూ సమంత చేసిన డ్యాన్స్‌కు కుర్రకారు ఫిదా. ఈ పాట యూట్యూబ్‌లో కొన్ని వారాల్లోనే 100 మిలియన్ల వీక్షణలను సొంతం చేసుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రం లోని అన్ని పాటలకు సోషల్ మీడియా లో విపరీతమైన క్రేజ్ పెరిగింది. తాజాగా ఈ చిత్రం లోని ఊ అంటావా, ఊ ఊ అంటావా అనే పాటకు నటి శ్రద్దా దాస్ స్టెప్పులు వేసింది. పుష్ప హ్యాంగ్ ఓవర్ అని, జస్ట్ ఫన్ అంటూ నటి చెప్పుకొచ్చింది. శ్రద్దా దాస్ ఈ వీడియో ను కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం తో బన్నీ రిప్లై ఇచ్చారు. 100 వ దశ భ్రాంతి అంటూ చెప్పుకొచ్చారు. శ్రద్దా దాస్ ఆర్య 2 చిత్రం లో బన్నీ సరసన నటించిన సంగతి అందరికీ తెలిసిందే.

Post a Comment

0Comments

Post a Comment (0)