శీతాకాలం అనగానే ఎముకలు కోరికే చలి… హిమపాతం.. చలిమంటలతో పాటు మరోకటి కూడా సహజంగానే గుర్తుకొస్తుంది. చలికాలంలో విడదీయరాని బంధం ఏర్పరచుకున్న మరో అంశమే జాగింగ్.. చలికాలంలో ఎక్కువగా చిన్నా పెద్దా, స్త్రీ పురుషులు అనే బేధం లేకుండా జాగింగ్ చేస్తూ
కనిపిస్తారు. కాగా ఎక్కువగా చలికాలంలోనే జాగింగ్ ఎందుకు చేస్తారు అని అడిగితే.. వెంటనే సమాధానం చెప్పలేము.. ఈ విషయంపై ఆసక్తికరమైన ఈ పరిశోధనను లండన్లోని సెయింట్ మేరీస్ యూనివర్సిటీ బృందం చేపట్టడంతో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. చలికాలంలో జాగింగ్ చేయడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట. ముఖ్యంగా స్త్రీలకు శీతాకాలంలో జాగింగ్ అత్యంత ప్రయోజనకారి అంటున్నారు. చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తి యొక్క హృదయస్పందన రేటు చాలా తక్కువగా ఉంటుంది. అందుకని వ్యక్తి చాలా సులభంగా పరిగెత్తవచ్చు. అంతేకాదు హృదయస్పందన రేటు దాదాపు 6 శాతం తగ్గుతుంది. దీంతో పరిగెత్తేవారికి అలసట చాలావరకు తక్కువగా ఉంటుంది. గుండె, రక్తనాళముల సంబంధిత సమస్యలతో బాధపడుతున్నవ్యక్తులు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉన్నప్పుడు పరిగెత్తడం ఇతర సమస్యలకు దారి తీస్తుంది. అలాంటి వారికి జాగింగ్ చెయ్యడానికి చక్కటి వాతావరణం చలికాలం. చల్లని వాతావరణంలో పరిగెత్తే వ్యక్తులకు తక్కువ శక్తి సరిపోతుంది. రాత్రిపూట శరీర ఉష్ణోగ్రత తక్కువ నమోదవడం వలన వ్యక్తులు పరిగెత్తాలే మానసికంగ సిద్ధమవుతారు. గుండె నుంచి శరీర అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉంటుంది. కావున శరీర ఉష్ణోగ్రత జాగింగ్ సమయంలో పెరుగుతుంది. దాదాపు 40 నిమిషాలు పరిగెత్తే వ్యక్తి నుంచి దాదాపు 1.3 లీటర్ల చెమట కారుతుంది. కానీ చల్లనివాతావరణంలో పరిగెత్తడం వలన డీహైడ్రేషన్ చాలాతక్కువగా ఉంటుంది. కనుక జాగింగ్ చెయ్యడానికి శక్తి తక్కువగా అవసరమవుతుంది. అన్నిటికంటే ముఖ్యవిషయం భానుడి లేలేత కిరణాలు ప్రసరిస్తున్న సమయంలో జాగింగ్ చెయ్యడం చాలా మంచిది. శరీరానికి అవసరం అయ్యే డి. విటమిన్ సంవృద్ధిగా లభిస్తుంది.
No comments:
Post a Comment