పురుషుల డబుల్స్ టైటిల్‌ గెలిచిన భారత జోడీ

Telugu Lo Computer
0


ఇండియా ఓపెన్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల డబుల్స్ టైటిల్‌ను చిరాగ్ శెట్టి, సాత్విక్‌సాయిరాజ్ రాంకిరెడ్డి జోడీ గెలుచుకుంది. ఈ టోర్నీ ఫైనల్‌లో ఇండోనేషియా లెజెండ్స్ హెండ్రా సెటియావాన్, మహ్మద్ ఎహ్సాన్ జోడీని ఓడించి భారత జోడీ తొలిసారి టైటిల్‌ను కైవసం చేసుకుంది. వీరిద్దరూ హోరాహోరీగా సాగిన పోరులో మాజీ ప్రపంచ రెండో ర్యాంకర్ ఇండోనేషియా జోడీని 21-16, 26-24 తేడాతో ఓడించి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకున్నారు. భారత జోడీ సూపర్ 500 టోర్నీ టైటిల్‌ను రెండోసారి గెలుచుకుంది. వీరిద్దరూ ఇంతకు ముందు 2019లో థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టైటిల్‌ను గెలుచుకున్నారు. 10వ ర్యాంక్‌లో ఉన్న భారత జోడీ తొలిసారి ఈ టోర్నీలో ఫైనల్స్‌కు చేరుకోగా, టాప్ సీడ్ ఇండోనేషియా జోడీ నుంచి గట్టి సవాలును ఎదుర్కొంది. సాత్విక్-చిరాగ్ మూడుసార్లు ప్రపంచ ఛాంపియన్ ఎహ్సాన్-సెటియావాన్ జోడీపై 4 మ్యాచ్‌ల్లో ఒక్కసారి మాత్రమే గెలిచారు. కానీ, సాత్విక్, చిరాగ్ అద్భుతంగా ఆరంభించారు. మొదటి గేమ్‌లో ఇండోనేషియా దిగ్గజాలకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదు. తొలి గేమ్‌ను 21-16తో గెలుచుకుని మ్యాచ్‌లో ముందంజ వేసింది. 43 నిమిషాల పోరాటంలో టైటిల్‌ను కైవసం చేసుకుంది. రెండవ గేమ్ ప్రారంభం నుంచి చాలా దగ్గరగా ఉంది. ఎహ్సాన్, సెటియావాన్‌ల అనుభవం, సామర్థ్యంతో భారత జోడీని ఇబ్బందుల్లోకి నెట్టారు. అయితే సాత్విక్, చిరాగ్‌లు కూడా గట్టిపోటీని అందించి ఆధిక్యంలోకి వెళ్లి మ్యాచ్ పాయింట్‌కు చేరువయ్యారు. ఇక్కడి నుంచి పోటీ మరింత కఠినంగా మారడంతో ఇరు జోడీలు చివరి పాయింట్‌ను పొందే అనేక అవకాశాలను కోల్పోయాయి. చివరికి, 43 నిమిషాల పాటు జరిగిన కఠినమైన మ్యాచ్‌లో సాత్విక్, చిరాగ్ 21-16 26-24 తేడాతో విజయం సాధించి టైటిల్‌ను గెలుచుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)