కొడుకు చదువు కోసం.....! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Saturday, 1 January 2022

కొడుకు చదువు కోసం.....!

 

ఎంత బిజీగా ఉన్నా సోషల్ మీడియాలో నిత్యం యాక్టీవ్‌గా ఉండే ఆనంద్ మహీంద్రా కొత్త ఏడాదికి విషెష్ చెబుతూ 2021లో తనకు బాగా నచ్చిన ఓ ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఓ తండ్రి తన కొడుకును తోపుడు బండిపై తీసుకెళ్తుండగా, కొడుకు బండి మీదున్న పాత సూట్‌కేసుపై కూర్చొని క్లాస్ పుస్తకం చదువుకుంటూ బిజీగా ఉన్నాడు. కొడుకు చుదువుకుంటున్న తీరును చూసి ఆ తండ్రి ఎంత కష్టమైనా పడేందుకు సిద్ధంగా ఉన్నానంటున్నట్టుగా చెమటను తుడుచుకుంటూ కొడుకువైపు చూస్తున్నాడు. ఈ ఫొటోను ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 2021లో నాకు బాగా నచ్చిన ఫొటో. ఎవరు తీశారో తెలియదు. ఆశ, కృషి, ఆశావాదానికి ఈ ఫొటో నిలువెత్తు నిదర్శనం.. మనం ఎందుకు జీవిస్తున్నామో ఈ ఒక్క ఫొటో చూస్తే సరిపోతుందని ఆనంద్ మహీంద్రా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. టాలెంట్ ఉన్న ఎందరినో ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుంటారు. కొడుకు కోసం ఓ తండ్రి పాత కార్ల సామాన్లతో కారును తయారు చేయడం, బైక్ మెకానిక్ పాడిన సాంగ్‌ను ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేయడం వంటివి చేశారు. ఇవన్నీ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉన్నాయి. 

No comments:

Post a Comment