మజ్జిగ - ప్రయోజనాలు - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Tuesday, 11 January 2022

మజ్జిగ - ప్రయోజనాలు


ఎండా కాలంలో వేడిని తట్టుకోవడానికి మజ్జిగ ఎక్కువ తాగుతారు. మజ్జిగను పెరుగు, కొన్ని మసాల పోపు దినుసులతో రుచికరంగా తయారుచేసుకుంటారు. కరీవేపాకు, ఆవాలు, అల్లం, జీలకర్ర వంటి పోపులతో బట్టర్ మిల్క్ తయారుచేసి తీసుకుంటారు. పెరుగులో ప్రోబయోటిక్ వంటి మంచి ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఉంటుంది. మజ్జిగ జీర్ణక్రియను పెంచుతుంది, క్యాలరీలను తగ్గిస్తుంది. ముఖ్యంగా మలబద్దకంతో బాదపడే వారు ప్రతి రోజూ ఉదయం ఒక గ్లాసు మజ్జిగను తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. రోజూ ఉదయం పరగడపున మజ్జిగ తాగడం వల్ల పొట్ట చల్లగా ఉంచి, కడుపులో మంట తగ్గిస్తుంది. అలాగే అసిడిక్ రిఫ్లెక్షన్ వల్ల పొట్టలో చీకాకును తొలగిస్తుంది. బట్టర్ మిల్క్ తాగినప్పుడు, కడుపులో ప్రశాంతంగా, చల్లగా ఉంటుంది. అందుకు కారణం పొట్ట అసౌకర్యానికి గురిచేసే వ్యర్థాలను బయటకు నెట్టవేయడం వల్ల పొట్ట చల్లగా ఉంటుంది ఇంకా, మజ్జిగా కరివేపాకు, జీలకర్ర, పెప్పర్ పౌడర్ వంటి పదార్థాలను చేర్చడం వల్ల అనేక ఔషధ గుణాలను పొందవచ్చు. కొద్దిగా హెవీగా భోజనం చేసినప్పుడు పొట్టలో అసౌకర్యంగా ఉన్నప్పుడు ఒక గ్లాసు అల్లం పౌడర్ కలిపిన మజ్జిగ తాగండి. ఇది జీర్ణశక్తినిన పెంచి వెంటనే కడుపు ఉబ్బరం తగ్గిస్తుంది. అసౌకర్యాన్ని పోగొడుతుంది. డీహైడ్రేషన్ తో బాధపడే వారికి ఇది ఒక మంచి రెమెడీ, ఒక గ్లాసు మజ్జిగలో కొన్ని మసాలా దినుసులు, ఉప్పు కలిపి తీసుకోవాలి. వేడి వాతావరణంలో మీరు సౌకర్యంగా ఫీల్ అవుతారు. మజ్జిగలో పొటాషియం, క్యాల్షియం, , విటమిన్ బి కాంప్లెక్స్, వంటి పోషకాలు అధికంగా ఉన్నాయి.డయోరియాతో బాధపడేవారు మజ్జిగలో అరటీస్పూన్ డ్రైజింజర్ పౌడర్ కలిపి తీసుకోవాలి. రోజులో 3సార్లు తీసుకుంటే డయోరియా సమస్య నుండి త్వరగా ఉపశమనం కలుగుతుంది. ఒక గ్లాసు మజ్జిగను తీసుకవోడం వల్ల కొలెస్ట్రాల్ వెల్స్ కంట్రోల్ అవుతాయి. మజ్జిగలో ఉండే బయో యాక్టివ్ ప్రోటీన్ యాంటీ క్యాన్సర్, యాంటీ బ్యాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు కలిగి ఉంటుంది. మజ్జిగను తాగడం వల్ల బ్లడ్ ప్రెజర్ ను తగ్గించుకోవచ్చు . 

No comments:

Post a Comment