ఉత్తరప్రదేశ్ లో అధికార పార్టీకి ముగ్గురు ఎమ్మెల్యేల గుడ్‌బై

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల సమీపించే కొద్దీ అధికార పార్టీకి గుడ్ బై లు ఎక్కువైనాయి.  ఓ కీలక మంత్రితో సహా, మరో ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్‌బై చెప్పేశారు. దీంతో యూపీ రాజకీయాలు ఒక్కసారిగా కీలక మలుపు తీసుకున్నాయి. కార్మిక మంత్రిగా బాధ్యతల్లో ఉన్న స్వామి ప్రసాద్ మౌర్య తన మంత్రి పదవికి రాజీనామా చేసి, బీజేపీకి గుడ్ బై చెప్పేసిన కాసేపటికే మరో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేసేశారు. అందులో రోషన్ లాల్ వర్మ, బ్రిజేశ్ ప్రజాపతి, భగవతి సాగర్ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మంత్రి స్వామి మౌర్యకు మద్దతుగానే రాజీనామాలు చేశారు. సీఎం యోగి ఏకపక్ష వైఖరి యూపీ బీజేపీలోని మరో వర్గానికి ఏమాత్రం నచ్చడం లేదని తెలుస్తోంది. కొన్ని రోజులుగా యోగిపై యూపీ బీజేపీలోని ఓ వర్గం విపరీతమైన అసంతృప్తితో ఉందన్న ప్రచారమూ జరిగింది. ఈ ప్రచారానికి ఊతమిచ్చేట్టు సమాజ్‌వాదీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై కీలక నేతలు చాలా అసంతృప్తితోనే ఉన్నారని, దీని ప్రభావం కచ్చితంగా పార్టీపై పడుతుందని వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)