దాల్చిన చెక్క పొడి + ఆలివ్ ఆయిల్ - ప్రయోజనాలు !

Telugu Lo Computer
0


యుక్త వయస్సులో కూడా జుట్టు రాలే సమస్య ఎక్కువగా కనపడుతుంది. జుట్టు రాలే సమస్య ప్రారంభం కాగానే ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ప్రయోజనం ఉంటుంది. ఒక స్పూన్ దాల్చిన చెక్క పొడి లో రెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలిపి జుట్టుకి పట్టించాలి. ఒక గంట అయ్యాక తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో 2 సార్లు చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా,ఆరోగ్యంగా ఉండి జుట్టు రాలకుండా ఒత్తుగా పెరుగుతుంది. తలకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు కుదుళ్లను ఉత్తేజపరుస్తుంది. దాల్చిన చెక్కలో యాంటీ మైక్రో బయల్ లక్షణాలు చుండ్రు,తలలో దురదను తగిస్తుంది. ఆలివ్ నూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ తల మీద చర్మం, జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఇది జుట్టును సెల్ డ్యామేజ్ నుంచి రక్షించి జుట్టుకు పోషణ అందిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)