హీరో సిద్ధార్థ క్షమాపణలు

Telugu Lo Computer
0


భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ పై హీరో సిద్దార్థ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఇక హీరో సిద్ధార్థ్ తాను చేసిన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు చెప్పాడు. సిద్దార్థ్ క్షమాపణలు చెప్పడంపై సైనా నెహ్వాల్ స్పందించారు. తప్పుతెలుసుకుని క్షమాపణ కోరడం సంతోషకరమన్నారు. అయితే.. ఓ మహిళ పట్ల ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అస్సలు ఆయోదయోగ్యం కాదన్నారు. ఏదీ ఏమైనప్పటికీ భగవంతుడు సిద్దార్థను చల్లగా చూడాలని ఆకాంక్షించారు." నటుడు సిద్ధార్థ్ మొదట నా గురించి ఎదో మాట్లాడారు.. మళ్లీ క్షమాపణలు కూడా చెప్పాడు.. అసలు ఈ విషయం ఎందుకు వైరల్ అయిందో కూడా నాకు తెలియదు. ట్విట్టర్‌లో నేను ట్రెండ్ అవ్వటం చూసి ఆశ్చర్యపోయాను. కానీ సిద్ధార్థ్ క్షమాపణలు చెప్పినందుకు సంతోషంగా ఉంది" అంటూ సైనా నెహ్వాల్ మీడియాతో మాట్లాడారు.

Post a Comment

0Comments

Post a Comment (0)