హరిహర వీరమల్లు మ్యూజిక్ రైట్స్ కు భారీ ధర !

Telugu Lo Computer
0


తెలుగు సినీ పరిశ్రమలో బాలీవుడ్ సంగీత సంస్థలు హవా చూపిస్తున్నాయి. ఇప్పటికే పలు సంస్థలు పెద్ద హీరోల మూవీ ఆడియో రైట్స్ దక్కించుకోగా, తాజాగా టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలు శాకుంతలం, హరిహర వీరమల్లు గ్లోబల్ మ్యూజిక్ హక్కులను టిప్స్ ఇండస్ట్రీస్ చేజిక్కించుకుంది. ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మ్యూజిక్ రైట్స్ పొంది సరికొత్త ఉత్సాహంతో మరో సంచలనం సృష్టించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ రూపొందిస్తున్న సినిమా ‘హరిహర వీరమల్లు’. పీరియాడికల్ యాక్షన్- అడ్వెంచర్ చిత్రంగా రూపొందుతున్న ఈ చిత్రానికి దర్శకుడు క్రిష్, నిర్మాత ఏ ఎం రత్నం, సంగీత దిగ్గజం లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి బాణీలు కడుతున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్ జంటగా నటిస్తుండగా.. అర్జున్ రాంపాల్‌ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఏప్రిల్ నెలలో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ మ్యూజిక్ హక్కులు కూడా టిప్స్ ఇండస్ట్రీస్ సొంతమయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)