ఆకలి ఓ దొంగను పట్టించింది! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 12 January 2022

ఆకలి ఓ దొంగను పట్టించింది!


తాళం వేసిన ఇంట్లో చొరబడిన ఓ దొంగ విలువైనవన్నీ మూటగట్టాడు. కానీ, మధ్యలో ఆకలి వేయడంతో కిచెన్‌లోకి వెళ్లి కిచిడి వండుకున్నాడు. అది తినే లోపలే పోలీసులు వచ్చి పట్టుకున్నారు. ఈ మూర్ఖపు దొంగ గురించి పోలీసులు ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'కిచిడీతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కానీ, దొంగతనం చేసే సమయంలో కిచిడీ వండటం ఆరోగ్యానికి అత్యంత హానికరం. దొంగను అరెస్టు చేశాం. అతడికి గువాహటి పోలీసులు 'హాట్ మీల్స్‌'ను అందిస్తున్నారు' అంటూ ట్వీట్ చేశారు. అసోం రాజధాని గువాహటిలోని హెంగెరాబారి ప్రాంతంలో ఓ ఇంటి తాళం పగలగొట్టిన దొంగ ఇంటిలోకి చొరబడ్డాడు. విలువైన వస్తువులను మూటగట్టాడు. ఆకలి వేయడంతో కిచెన్‌లో కిచిడీ వండటం ప్రారంభించాడు. వంట చేసే సమయంలో అలజడి రావడంతో చుట్టు పక్కలవారు అలర్ట్ అయ్యారు. ఆ దొంగను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే, దొంగతనం ప్రయత్నాన్ని అసోం పోలీసులు హాస్యాస్పదంగా తీసుకున్న తీరు పలువురిని అలరించింది.

No comments:

Post a Comment