ఊపిరితిత్తులు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే...! - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Wednesday, 12 January 2022

ఊపిరితిత్తులు పరిశుభ్రంగా ఉంచుకోవాలంటే...!


ఊపిరితిత్తులు ఆరోగ్యంగా దృఢంగా ఉంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు.  గాలిలో ఉండే విషపదార్థాలు., కాలుష్య కారకాలు, పొగ తాగే అలవాటు, కొన్ని అనారోగ్య ఆహారపు అలవాట్ల కారణంగా ఊపిరితిత్తులు బలహీనంగా మారతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా బలంగా, ఉండాలంటే  సింపుల్ గా క్లీన్ చేసుకోవచ్చు. ఊపిరితిత్తులు క్లీన్ గా ఆరోగ్యంగా ఉండాలంటే కొన్నిరకాల  ఆహారాలు తీసుకుంటే మంచిది. ఆరెంజ్ రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఊపిరితిత్తుల ఆక్సిజన్ శోషణ సామర్థ్యాన్ని బాగా పెంచుతుంది. దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండటం వల్ల శ్వాస సమస్యల చికిత్సకు అద్భుతంగా పనిచేస్తుంది. ఉల్లిపాయలు కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయి. ఆపిల్ లో ఉండే ఫ్లేవనాయిడ్స్, విటమిన్ బి, సి, ఇ ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సహాయపడతాయి. ఉదయాన్నే పరగడుపున ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగితే ఊపిరితిత్తుల్లో కఫము,శ్లేష్మం లేకుండా శుభ్రం అవుతాయి. ఉదయాన్నే కొన్ని పుదీనా ఆకులను తిన్నా ఊపిరితిత్తులు శుభ్రం అవుతాయి. వ్యాయామం, ప్రాణాయామం చేయటం వలన లంగ్స్ కెపాసిటీ బాగా పెరిగి శ్వాస సంబంధిత సమస్యలు దూరమవుతాయి.


No comments:

Post a Comment