గాల్లో బలహీనపడుతున్న కరోనా వైరస్?

Telugu Lo Computer
0


కరోనా వైరస్ గాలి ద్వారా కూడా సంక్రమిస్తుందన్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్​ 20 నిమిషాలపాటు గాల్లో ఉంటే దాని సామర్థ్యం 90 శాతం క్షీణిస్తున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మొదటి 5 నిమిషాల్లోనే అధికశాతం సంక్రమణ శక్తిని కోల్పోతున్నట్లు వెల్లడయింది. కరోనా వైరస్ గాల్లో ఉన్నప్పుడు అధిక శాతం సంక్రమణ శక్తికి కోల్పోతున్నట్లు యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన ఏరోసోల్ రీసెర్చ్ సెంటర్ వెల్లడించింది. ఈ అధ్యయనాన్ని ఇంకా పూర్తిస్థాయిలో సమీక్షించలేదు. కొద్దిపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ వ్యాధి నుంచి బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరాన్ని పాటించడం వల్ల కొవిడ్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేయొచ్చని మరోసారి తెలిపారు.  వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశాల్లో కరోనా వైరస్‌ అధికంగా సంక్రమిస్తుందని బ్రిస్టల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు తెలిపారు. దీనిపై చాలా మంది దృష్టి సారిస్తున్నారని కానీ భౌతిక దూరం విషయంలో మాత్రం అశ్రద్ధ చూపిస్తున్నారని పేర్కొన్నారు.  ప్రజలు దగ్గర దగ్గరగా ఉంటేనే వైరస్‌ సోకే ప్రమాదం అధికంగా ఉంటుందని ఈ అధ్యయంలో పాలుపంచుకున్న ప్రొఫెసర్‌ జొనాథన్‌ రీడ్‌ వెల్లడించారు. అందుకే ప్రభుత్వాలు తీసుకొచ్చిన నిబంధనలను అందరూ పాటించాలని సూచించారు. డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్‌లో లక్షణాలు తక్కువగా ఉన్నాయని అందుకే తమకు వ్యాధి సోకినట్లు చాలా మందికి తెలియడం లేదని, అలాంటి వారు బయట తిరుగుతూ వైరస్ వ్యాప్తిని మరింత పెంచుతున్నారని సౌతాఫ్రికాలో నిర్వహించిన రెండు పరిశోధనలు తేల్చాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)