కరోనా బారినపడ్డ వారికి హెల్త్ టిప్స్ !

Telugu Lo Computer
0


దేశంలో కరోనా పంజా విసురుతోంది. మహమ్మారి రకరకాలుగా రూపాంతరం చెందుతూ ఒమిక్రాన్‌ రూపంలో వెంటాడుతోంది. ఒక్కసారి కరోనా బారిన పడితే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా 24 లక్షల మందికిపైగా కొత్తగా కరోనా సోకినట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే కరోనా సోకినట్లయితే దాని నుంచి బయట పడేందుకు మార్గాలను అనుసరించాల్సి ఉంటుంది.  శరీరాన్ని ఎప్పుడూ హైట్రేటెడ్‌గా ఉంచడం ఎంతో ముఖ్యం. కరోనా నుంచి బయటపడేందుకు ఎక్కువ మొత్తంలో నీరు తాగాలి. ఇలా చేయడం వల్ల కోవిడ్‌ వైరస్‌ ప్రభావం తక్కువగా ఉంటుందని ఆస్ట్రేలియన్‌ పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. రోజులో అధికంగా నీరు తాగడం వల్ల శరీరానికి ఎంతో మేలని ఇది వరకు ఎంతో మంది వైద్య నిపుణులు సూచించిన విషయం తెలిసిందే. కానీ కరోనా సమయంలో తప్పకుండా నీరు తాగడం ఎంతో అవసరమంటున్నారు నిపుణులు. ఈ వ్యాధి బారిన పడినా ముందుగా కోలుకోవాలంటే విశ్రాంతి తీసుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించాలి. కరోనా వైరస్‌ బారిన పడిన వారు శరీరానికి ఎక్కువ మొత్తంలో విశ్రాంతి ఇవ్వాలని వైద్యులు సిఫార్సు చేస్తున్నారు. విశ్రాంతి తీసుకోవడం వల్ల అనారోగ్యం నుంచి త్వరగా బయటపడవచ్చని సూచిస్తున్నారు. ఎక్కువ పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు. వేపుడ్లు, మసాలా ఫుడ్‌, జంక్‌ ఫుడ్‌, శీతల పానీయాలు, మద్యం వంటి వాటికి దూరంగా ఉండటం మంచిది.శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి రోజు వ్యాయమం తప్పనిసరి. యోగా చేయడం, ఇతర వ్యాయమాలు చేయడం శరీరానికి ఎంతో మేలు. ప్రాణాయామం చేయడం వల్ల శ్వాసకోశ వ్యవస్థ బలంగా తయారవుతుందని, కోవిడ్‌ నుంచి కోలుకున్న తర్వాత కూడా సాధారణ వ్యాయమాలతో ప్రారంభించాలని సూచిస్తున్నారు. కరోనా మహమ్మారి మానసికంగా చాలా నష్టపరుస్తుంది. కరోనా బారిన పడిన వారి శరీరం బలహీనపడడమే కాకుండా ఆ వ్యక్తి మానసికంగా కూడా బలహీనంగా మారుతాడు. ఒత్తిడి, ఆందోళన మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఎలాంటి టెన్షన్‌కు గురి కాకుండా ధాన్యం వంటివి అలవర్చుకోవాలి.

Post a Comment

0Comments

Post a Comment (0)