అన్నం కుక్కర్‌లో వండడం మంచిదేనా?

Telugu Lo Computer
0


అన్నం ప్రెషర్‌ కుక్కర్లలో వండే వారు చాలా మంది  ఉన్నారు. దీని వల్ల గ్యాస్‌ ఆదా కావడమే కాకుండా అన్నం త్వరగా ఉడుకుతుంది.  ప్రెషర్‌ కుక్కర్‌లో అన్నం వండుకు తినడం ఆరోగ్యానికి మంచిదేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ప్రెషర్‌ కుక్కర్‌లో వండే అన్నం రుచిగా ఉండడమే కాకుండా కుక్కర్‌లో వండిన అన్నంలో పిండి పదార్థం తొలగిపోతుందట. అంతేకాకుండా ఫ్యాట్‌ కంటెంట్‌ కూడా తక్కువగా ఉంటుంది. కుక్కర్‌లో వండిన అన్నంలో కార్బోహైడ్రేట్స్‌, ప్రొటీన్‌ లాంటి నీటిలో కలిగే పోషకాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కుక్కర్‌లో వండిన అన్నంతో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని అంటున్నారు. అన్నం సులువగా జీర్ణమవుతుంది. వీటిలో ప్రోటీన్స్‌, పిండి పదార్థాలు, ఫైబర్‌ కంటెంట్‌ లాంటి పోషకాలు కూడా ఉంటాయట. ప్రెషర్‌ కుక్కర్‌లో వండటం వల్ల బియ్యంలో, నీళ్లలో ఉండే హానికర బ్యాక్టీరియా నశించిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)