ఈ ఏడాది 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీకాలం పూర్తి !

Telugu Lo Computer
0


2022లో 77 మంది రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నట్లు రాజ్యసభ సచివాలయం తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్​ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీల పదవీకాలం ముగియనుంది. 2022, జూన్‌ 21 నాటికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఎంపీలు సురేష్‌ ప్రభు, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్‌, విజయసాయిరెడ్డి పదవీకాలం ముగియనుంది. తెలంగాణ నుంచి ఎంపీలు లక్ష్మీకాంతరావు, డి.శ్రీనివాస్‌ల పదవీకాలం ముగియనుంది. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్​, ముక్తార్​ అబ్బాస్​ నఖ్వీ, పీయూష్​ గోయల్​ వంటి ప్రముఖుల పదవీ కాలం ముగియనుంది. ఖాళీ కానున్న స్థానాలు తిరిగి వైసీపీ, టీఆర్ఎస్ కే దక్కనున్నాయి. ఏపీ నుంచి విజయసాయిరెడ్డి యథాతథంగా కొనసాగే అవకాశం ఉంది. మరో మూడు స్థానాల్లో కొత్తవారికి అవకాశం ఇవ్వనున్నట్లు కనిపిస్తోంది. టీఆర్ఎస్ నుంచి కొత్తవారిని రాజ్యసభకు పంపే అవకాశం ఉంది. ప్రస్తుతం రాజ్యసభలో బీజేపీకి 97, కాంగ్రెస్‌కు 34 మంది సభ్యుల సంఖ్యా బలం ఉంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆరు సీట్ల వరకు తన బలాన్ని నిలబెట్టుకునే అవకాశం ఉంది. రాజ్యసభలో డీఎంకే, వైసీపీ బలం పెరగనుంది. ఇతర రాష్ట్రాల నుంచి పదవీ విరమణ చేసే ప్రముఖుల్లో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌ (కర్ణాటక), ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ (ఝార్ఖండ్‌), పీయూష్‌ గోయల్‌ (మహారాష్ట్ర), కాంగ్రెస్‌ నుంచి ఆనంద్‌ శర్మ (హిమాచల్‌ప్రదేశ్‌), జైరాం రమేశ్‌ (కర్ణాటక), ఏకే ఆంటోనీ (కేరళ), పి.చిదంబరం (మహారాష్ట్ర), అంబికా సోనీ (పంజాబ్‌), కపిల్‌ సిబల్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌) ఉన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)