రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 6 January 2022

రెండు మూడు రోజుల్లో పీఆర్సీపై ప్రకటన


ముఖ్యమంత్రి జగన్ తో ఉద్యోగ సంఘాల భేటీ ముగిసింది. ఈ సమావేశంలో సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు చెప్పిన అంశాలను స్వయంగా నోట్‌ చేసుకున్నానని, అన్నింటినీ స్ట్రీమ్‌లైన్‌ చేయడానికి అడుగులు ముందుకేస్తామని ప్రకటన చేశారు. మెరుగ్గా చేయగలిగే దిశగా ప్రయత్నం చేస్తామని, ప్రాక్టికల్‌గా ఆలోచించాలని ఉద్యోగ సంఘాలను కోరుతున్నానని వెల్లడించారు. దయచేసి అందరూ ఆలోచన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మోయలేని భారాన్ని మోపకుండా కాస్త సానుకూల దృక్పథంతో ఉండాలని కోరుతున్నానని పేర్కొన్నారు. ఎంత మంచి చేయగలిగీతే అంత మంచి చేస్తానని అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తామని మంచి చేయాలన్న తపనతో ఉన్నామని వెల్లడించారు. రెండు మూడు రోజుల్లో పీఆర్సీ పై ప్రకటన చేస్తామని.. నేను మీ అందరి కుటుంబ సభ్యుడ్ని అంటూ మీకు మనసా, వాచా మంచి చేయాలనే తపనతో ఉన్నానని.. ఎవరు ఆందోళన చెందనక్కర్లేదు అంటూ భరోసా కల్పించారు సిఎం జగన్ మోహన్ రెడ్డి.

No comments:

Post a Comment