బిగ్ బాస్ 6 లోకి ఉప్పల్ బాలు?

Telugu Lo Computer
0


తెలుగు బిగ్ బాస్ షో సీజన్ సిక్స్ ప్లాన్ చేయటం తెలిసిందే. ఓటిటి లో టాప్ కంటెస్టెంట్ లను సోషల్ మీడియాలో సెలబ్రిటీలను తీసుకోవడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నారట. ఇప్పటికే యాంకర్ వర్షిని, యూట్యూబ్ చానల్స్ లో ఇంటర్వ్యూ చేసే యాంకర్ శివ సెలక్ట్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ట్రాన్స్ జెండర్ కోటాలో ఉప్పల్ బాలు ని తీసుకోవడానికి షో నిర్వాహకులు రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఉప్పల్ బాలు కి బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్రాంక్ వీడియోలు చేస్తూనే మరో పక్క ఎంటర్ టైన్మెంట్ వీడియోలు చేస్తూ… ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటాడు. దీంతో “మా టీవీ” యాజమాన్యం బిగ్ బాస్ ఆఫర్ చేయగా.. భారీ రెమ్యునరేషన్ అడిగినట్లు దానికి మా టీవీ యాజమాన్యం కూడా ఓకే చెప్పినట్లు.. ఇదే తరుణంలో హౌస్ లో ఏది చేయమన్నా.. చేయాలి దానికి నో చెప్పకూడదు అని షరతు కూడా.. ఉప్పల్ బాలు కి పెట్టినట్లు లేటెస్ట్ టాక్. ఎంటర్ టైన్మెంట్ పరంగా అన్ని రకాలుగా బిగ్ బాస్ ఆదేశాలు హౌస్ లో ఏది చెప్తే అది చెయ్యాలి అని.. అందుకు ఓకే అయితే నువ్వు అడిగిన రెమ్యూనరేషన్.. ఇవ్వటం జరుగుతుందని ఉప్పల్ బాలు కి తెలియజేశారు అని అంటున్నారు. దీంతో ఉప్పల్ బాలు ఆలోచనలో పడినట్లు తెలుస్త్తుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)