బస్సు ప్రమాదంలో డ్రైవర్‌కు 190 ఏళ్ల జైలు శిక్ష..!

Telugu Lo Computer
0


2015 మే 4వ తేదీన 65 మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడింది.. డీజిల్‌ ట్యాంక్‌ బద్దలు కావడంతో మంటలు చెలరేగాయి. భారీగా ప్రాణనష్టం జరిగింది. ఆ ప్రమాదంలో 22 మంది సజీవదహనం కాగా, 12మంది ప్రయాణికులు తీవ్రగాయాలపాలయ్యారు.. అయితే, ఈ ప్రమాదానికి బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉందని తేల్చిన కోర్టు.. ప్రమాద సమయంలో తప్పించుకునేందుకు ఉండాల్సిన అత్యవసర ద్వారం మూసివేశారని.. అక్కడ అదనపు సీటు ఏర్పాటు చేయడంతో.. బాధితులు తప్పించుకోవడానికి వీలు లేకుండా పోయినట్టు పేర్కొంది.. ఇక, నిర్లక్ష్యంగా బస్సు నడిపి ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌కు 10 ఏళ్ల చొప్పున 19 విడతలుగా జైలులో గడపాలని మధ్యప్రదేశ్‌లోని ఓ కోర్టు.తీర్పు వెలువరించింది.. అంటే.. 19 విడతలుగా పదేళ్లు చొప్పున అంటే.. 190 ఏళ్ల జైలు శిక్ష విధించింది.


Post a Comment

0Comments

Post a Comment (0)