దాల్చిన చెక్క, నిమ్మపానీయం - డయాబెటిస్ నియంత్రణ

Telugu Lo Computer
0


అంగుళం దాల్చిన చెక్క ముక్కను, తొక్క తీయకుండా నిమ్మకాయ సగం ముక్కను 4 బాగాలుగా చేసి ఒక గ్లాస్ నీళ్లలో వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు మరిగిస్తే దాల్చినచెక్క, నిమ్మలో ఉన్న లక్షణాలు నీటిలోకి చేరతాయి. మరిగిన నీటిని గ్లాస్ లోకి వడకట్టి అరస్పూన్ తేనె కలిపి ఉదయం లేదా సాయంత్రం సమయంలో తాగాలి. ఈ డ్రింక్ ని 10 రోజుల పాటు తాగితే మంచి ప్రయోజనం కనపడుతుంది.ఈ డ్రింక్ తాగితే కీళ్ల నొప్పులు తగ్గటమే కాకుండా రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుంది. అధిక బరువు, డయాబెటిస్ వంటి సమస్యలకు బాగా పనిచేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచటానికి చాలా ఉపయోగపడుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)