అసాధారణ రీతిలో ఒమిక్రాన్ వ్యాప్తి

Telugu Lo Computer
0


ఇప్పటివరకు బయటపడిన కరోనా వేరియంట్లతో పోలిస్తే ఒమిక్రాన్ రకం అసాధారణ రీతిలో వ్యాపిస్తోందని, ఇప్పటికే 77 దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ త్వరలోనే మరిన్ని దేశాలకు వ్యాపించనుందని ప్రపంచ ఆరోగ్యసంస్థ హెచ్చరించింది. ఈ నేపధ్యంలో ప్రపంచ దేశాలు వైరస్ కట్టడికి తగిన చర్యలు చేపట్టాలని ప్రపంచ ఆరోగ్యసంస్థ చీఫ్ టెడ్రోస్ అథనామ్ గెబ్రెయేనస్ సూచించారు. అయితే ఇది స్వల్ప వ్యాధి మాత్రమేనంటూ నిర్ధారణకు రావద్దని డబ్లుహెచ్‌ఒ నిపుణుడు బ్రూస్ అయిల్ వార్ట్ హెచ్చరించారు. అమెరికాలో బయటపడుతున్న కేసుల్లో మూడు శాతం ఒమిక్రాన్ రకమే. యూరప్ లోనూ ఆస్పత్రి చేరికలు పెరుగుతుండగా, ఇప్పటికే అక్కడ తొలి మరణం సంభవించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)