ఆస్తిని దక్కించుకున్న రామ్‌పూర్‌ నవాబుల వారసులు

Telugu Lo Computer
0


ఉత్తరప్రదేశ్‌లోని రామ్‌పూర్‌ను ఒప్పుడు ఉమ్మడి నవాబు రజా అలీ ఖాన్ పాలించారు. అలీఖాన్ ఆస్తులు భారతీయ రాజకుటుంబానికి చెందిన 16మంది వారసులకు దక్కలేదు. దీంతో వారు న్యాయస్థానంలో పోరాడారు. ఎట్టకేలకు పోరాటంలో విజయం సాధించారు. న్యాయస్థానం సుమారు రూ. 2650 కోట్ల విలువైన ఆస్తులు అలీఖాన్‌ వారసులకే చెందుతుందని తీర్పునిచ్చింది. దీంతో ఆ ఆస్తి మొత్తం షరియత్ రూల్స్ ప్రకారం తన 16 మంది చట్టబద్ధ వారసులకు త్వరలో పంచి ఇవ్వనున్నారు. ఈ ఆస్తి కోసం వారసులు 50 ఏళ్ల పాటు కోర్టుల చుట్టూ తిరగాల్సివచ్చింది. ఈ క్రమంలో వారి పోరాటం ఫలించింది. ఆస్తి దక్కింది.రాంపూర్‌లోని జిల్లా కోర్టు గతవారం తుది తీర్పు వెలువరించటంతో 49 ఏళ్ల కుటుంబ కథ ముగిసింది. ఈ ఆస్తుల్లో భాగంగా ఎస్టేట్‌లో 220 గదుల ఖాస్‌బాగ్ ప్యాలెస్, చుట్టుపక్కల 140 హెక్టార్ల భూమి, ఆ భూమిలో ఉన్న పలు రాజభవనాలు, రత్నాలు పొదిగిన తుపాకులు, లెక్కలేనన్ని ఆభరణాలు, పాతకాలపు కార్ల సముదాయం, విస్తారమైన తోటలతో పాటు ఒక ప్రైవేట్ రైల్వే స్టేషన్ కూడా ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)