భార్య, మరదలితో రామ్‌ చరణ్‌ స్టెప్పులు

Telugu Lo Computer
0


అర్మాన్ ఇబ్రహీంను ప్రేమిస్తున్న అనుష్ప పెద్దలను ఒప్పించి ప్రేమ వివాహం చేసుకుంది. గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఈ పెళ్లి వేడుకల్లో కామినేని ఫ్యామిలీతో పాటు మెగాఫ్యామిలీ కూడా పాల్గొంది. వీరిద్దరి ఎంగేజ్‏మెంట్ నుంచి మొదలు.. దోమకొండ గడి కోటలో జరిగిన పోచమ్మ పండుగ, సంగీత్, మేహంది, పెళ్లి వేడుకల వరకు ప్రతి చిన్న వేడుకకు రామ్‌ చరణ్‌ హాజరై సందడి చేశాడు. ఈ పెళ్లి వేడుకల్లో భాగంగా చెర్రి తన భార్య ఉపాసన, మరదలు అనుష్పలతో కలిసి చిందులేస్తూ సందడి చేశాడు. మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ సాచెత్ తాండన్, పరంపరా ఠాకూర్‌లు పాట పాడుతుంటే చరణ్‌ మరదలితో కలిసి డ్యాన్స్‌ చేస్తుండగా మధ్యలో ఉపాసన కూడా వారితో కలిసి స్టెప్పులెస్తుంది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)