పద్దెనిమిదేళ్ల వారికి టీకాలు !

Telugu Lo Computer
0


శనివారం రాత్రి తొమ్మిదిన్నరకు ప్రధానమంత్రి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ నుంచి ట్వీట్ వచ్చింది. మరో పావుగంటలో మోడీ జాతినుద్దేశించి ప్రసంగిస్తారన్నది ఆ ట్వీట్ సారాంశం. అంతే అందరిలోనూ టెన్షన్ ప్రారంభమయింది. ఏదో ఉందని అందరూ కంగారు పడిపోయారు. ఎందుకైనా మంచిదని చాలా మంది ఏటీఎంల వద్దకు పరుగులు పెట్టారు. కొంత మంది ఆన్‌లైన్‌లో నిత్యావసర వస్తవులు ఆన్‌లైన్‌లో ఆర్డర్లు పెట్టుకోవడంలో బిజీ అయ్యారు. దీనికి కారణం లాక్ డౌన్ భయమే. దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తి పెరుగుతోంది. అది ప్రమాదకరంగా మారుతోందని రెండు రోజుల నుంచి కేంద్రం ప్రకటిస్తూనే ఉంది. అయితే ఏ రాష్ట్రమూ సీరియస్‌గా తీసుకున్నట్లుగా కనిపించడం లేదు. దీంతో కేంద్రం లాక్ డౌన్ ప్రకటిస్తుందేమో అని ఎక్కువ మంది కంగారు పడ్డారు. మోడీ ఇచ్చిన ఎమర్జెన్సీ ప్రసంగంలో పదిహేనేళ్ల నుంచి పద్దెనిమిదేళ్ల వయసు ఉన్న వారికి టీకాలు. అలాగే అరవై ఏళ్లు పైబడిన వారికిప్రికాషన్ డోస్ ప్రారంభించడం అనేది ఆయన ప్రసంగ సారాంశం. 

Post a Comment

0Comments

Post a Comment (0)