కడపలో శంకుస్థాపనలు చేయనున్న జగన్ !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప కొప్పర్తిలో 3,155 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌ , 801 ఎకరాల్లో ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌లను సీఎం జగన్ ప్రారంభించాలని నిర్ణయించారు. ఇరవై మూడో తేదీన వాటిని జగన్ ప్రారంభిస్తారు. మెగా ఇండస్ట్రియల్ హబ్ ద్వారా పాతిక వేల కోట్ల పెట్టుబడులు.. డెభ్బై ఐదు వేల ఉద్యోగాలు వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. ఎలక్ట్రానిక్ క్లస్టర్ వల్ల పదివేల కోట్ల పెట్టుబడులు పాతిక వేల ఉద్యోగాలు వస్తాయి. డిక్సన్ సంస్థ ఇప్పటికే అక్కడ షెడ్లను నిర్మించింది.. అక్కడ పని చేయడానికి ఉద్యోగుల్ని నియమించింది. వారికి జగన్ చేతుల మీదుగా అపాయింట్‌మెంట్ లెటర్లు 23వ తేదీన అందిస్తారు. కొప్పర్తిలో డిక్సన్ పెట్టుబడులు ప్రారంభమవ్వగా ఫాక్స్‌కాన్, డీజీకార్న్, రెసల్యూట్, ఆస్ట్రమ్‌ వంటి పలు సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. ఎలక్ట్రానిక్స్ క్లస్టర్‌లో 18 ఫార్మా, సిమెంట్, పెయింట్స్‌ తయారీకి చెందిన యూనిట్లు రెడీ అయ్యాయి. బద్వేల్‌ వద్ద రూ.956 కోట్ల పెట్టుబడితో సెంచురీ ప్లైబోర్డ్‌ ఇండియా లిమిటెడ్‌ యూనిట్‌ పనులను ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. పులివెందులలో రూ.110 కోట్లతో ఏర్పాటు చేయనున్న ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ అండ్‌ రిటైల్‌ లిమిటెడ్‌ యూనిట్‌ పనులకు డిసెంబర్‌ 24న జగన్‌ శంకుస్థాపన చేయనున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)