దేశంలోనే తొలిసారిగా బస్తీ దవాఖానా

Telugu Lo Computer
0


 

దేశంలోనే మొదటిసారిగా బస్తీ దవాఖాన్ ప్రారంభించిన ఘనత మనదేనని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. 15వ ఆర్ధిక సంఘం హైద్రాబాద్‌లో ప్రారంభమైన బస్తి దవాఖానలను మోడల్‌గా తీసుకొని దేశవ్యాప్తంగా అమలు చేయాలని సూచించిందన్నారు. హైద్రాబాద్‌లో బస్తి దవాఖానా ప్రారంభమైన తరవాత ఇతర జిల్లాలు నుంచి డిమాండ్ వస్తోందని హరీష్‌రావు పేర్కొన్నారు. '144 బస్తి దవాఖానాలను త్వరలోనే ఏర్పాటు చేయబోతున్నాం. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా  ఉచితంగాఅన్ని పరీక్షలు  చేస్తున్నాం. 11 లక్షల మందికి ఉచిత పరీక్షలు చేశాం. రిపోర్ట్స్ నేరుగా మొబైల్‌కి వస్తున్నాయి. 4 సూపర్ స్పెషాలిటి ఆసుపత్రులను నిర్మించబోతున్నామని హరీష్‌రావు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)