లలిత

Telugu Lo Computer
0


భారతీయ సినీ నటి, నర్తకి. ఈమె ట్రావన్‌కోర్ సిస్టర్స్ గా ప్రసిద్ధి చెందిన లలిత, పద్మిని, రాగిణిలలో మొదటి సోదరీమణి. ఈమె 1930, డిసెంబరు 12న కేరళ రాష్ట్రానికి చెందిన ట్రవన్కోర్ సంస్థానంలో తిరువనంతపురంలో గోపాలపిళ్లె, సరస్వతి అమ్మలకు జన్మించింది. ఈమె 1938లో అదిథన్ కనవు అనే తమిళ చిత్రం ద్వారా సినిమా రంగప్రవేశం చేసింది. ఈమె తెలుగు, మళయాలం, తమిళ, హిందీ చిత్రాలలో నటించింది. ఈమె చెల్లెళ్లు పద్మిని, రాగిణులు కూడా నర్తకులుగా, సినీ తారలుగా రాణించారు. ఈమె తన సోదరీమణులతో కలిసి వెంపటి చిన సత్యం వద్ద కూచిపూడి నృత్యం నేర్చుకుంది. ఈమె తన సోదరీమణులకంటే ముందుగా సినిమా రంగంలో ప్రవేశించింది. ఎక్కువగా మలయాళ సినిమాలలో నటించి వ్యాంపు పాత్రలలో ఎక్కువ పేరు సంపాదించింది. సినిమా నటి శోభన ఈమె మేనకోడలు. ఈమె 1983లో మృతి చెందింది.

Post a Comment

0Comments

Post a Comment (0)