మైఖేల్‌ వాన్‌కు వసీం జాఫర్‌ కౌంటర్‌ !

Telugu Lo Computer
0

 

యాషెస్‌ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన ఇంగ్లండ్‌.. ట్రోఫీని ఆస్ట్రేలియాకు సమర్పించుకుంది. ముఖ్యంగా మూడో టెస్టులో పేలవ ప్రదర్శనతో ప్రత్యర్థి ముందు తలవంచింది. ఆసీస్‌ అరంగేట్ర బౌలర్‌ స్కాట్‌ బోలాండ్‌ ధాటికి నిలవలేక ఇంగ్లండ్‌ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో 68 పరుగులకే ఆలౌట్‌ అయి  ఇంగ్లండ్‌ అప్రదిష్టను మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌.. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైఖేల్‌ వాన్‌కు అదిరిపోయే రీతిలో కౌంటర్‌ ఇచ్చాడు. ఏంటీ.. 100 లోపే జట్టు ఆలౌట్‌ అవుతుందా అంటూ గతంలో వాగన్‌ చేసిన ట్వీట్‌ను ప్రస్తావిస్తూ ట్రోల్‌ చేశాడు. కాగా 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా 30.5 ఓవర్లలో 92 పరుగులు చేసి ఆలౌట్‌ అయ్యింది. దీంతో కివీస్‌ చేతిలో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఈ నేపథ్యంలో టీమిండియా ఆట తీరును విమర్శిస్తూ... ''92కే ఇండియా ఆలౌట్‌... ఈరోజుల్లో కూడా ఏదేని జట్టు 100 లోపు పరుగులకే ఇలా చేతులెత్తేస్తుందంటే నమ్మకం కలగడం లేదు'' అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ప్రస్తుతం యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లండ్‌ పరాభవాన్ని గుర్తుచేస్తూ వసీం జాఫర్‌ ఇంగ్లండ్‌ 68 పరుగులకే ఆలౌట్‌ అయింది మైఖేల్‌ వాన్‌ అంటూ ట్రోల్‌ చేశాడు. ఇందుకు స్పందించిన మైఖేల్‌.. ''వెరీ గుడ్‌ వసీం'' అంటూ ఫన్నీ ఎమోజీలను జతచేశాడు. కాగా ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఆతిథ్య ఆసీస్‌ ఏకపక్ష విజయాలు సాధించి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కైవసం చేసుకుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)