అత్యధిక కలెక్షన్లు రాబట్టిన పది చిత్రాలు !

Telugu Lo Computer
0


2020 చివర్లో 'సోలో బ్రతుకే సో బెటర్' చిత్రంతో మూసుకున్న థియేటర్లు తెరుచుకున్నాయి. ఆ చిత్రం ఇచ్చిన ఊపుతో 2021 సంక్రాంతి బరిలో 'క్రాక్' 'రెడ్' 'అల్లుడు అదుర్స్' వంటి 4 మిడ్ రేంజ్ సినిమాలు విడుదలై ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాయి.'మాస్టర్' వంటి డబ్బింగ్ సినిమా కూడా విడుదలయ్యి వీటికి మంచి పోటీని ఇచ్చింది. దాంతో టాలీవుడ్ తొందరగానే కోలుకున్నట్టు కనిపించింది. ఫిబ్రవరి, మార్చిలో కూడా బ్లాక్ బస్టర్లు పడ్డాయి. ఇండియాలో మరే సినీ పరిశ్రమ కోలుకోని విధంగా టాలీవుడ్ కోలుకుంది. ఏప్రిల్ లో 'వకీల్ సాబ్' వంటి పెద్ద సినిమా కూడా విడుదలైంది. అయితే ఆ సినిమా రిలీజ్ అయిన 3 వారాలకే మళ్ళీ థియేటర్లు మూతపడ్డాయి. విడుదలకి సిద్ధంగా ఉన్న పెద్ద సినిమాలు మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యాయి. జూలైలో థియేటర్లు మళ్ళీ తెరుచుకున్నప్పటికీ.. పెద్ద సినిమాలు రిలీజ్ అవ్వడానికి 5 నెలల వరకు టైం పట్టింది. డిసెంబర్ లో 'అఖండ' 'పుష్ప' 'శ్యామ్ సింగ రాయ్' వంటి సినిమాలు విడుదలై మంచి కలెక్షన్లను రాబట్టాయి. అల్లు అర్జున్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూడో చిత్రం డిసెంబర్ 17న విడుదలైంది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లోనూ విడుదలైన ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఇప్పటివరకు రూ.120.35 కోట్ల షేర్ ను రాబట్టి ఈ ఏడాదికి అత్యథిక కలెక్షన్లు రాబట్టిన చిత్రంగా రికార్డులు సృష్టించింది. పవన్ కళ్యాణ్ కంబ్యాక్ మూవీ అయిన 'వకీల్ సాబ్' చిత్రం ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.85.61 కోట్ల షేర్ ను రాబట్టి ఎబౌవ్ యావరేజ్ గా నిలిచింది. బాలయ్య- బోయపాటి ల హ్యాట్రిక్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం 25 రోజులకి గాను వరల్డ్ వైడ్ గా రూ.68.97 కోట్ల షేర్ ను రాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. వైష్ణవ్ తేజ్- కృతిశెట్టి జంటగా నటించిన ఈ చిత్రం ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.51.52 కోట్ల షేర్ ను రాబట్టి డబుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది.అప్పటి వరకు ఫిబ్రవరి నెలకి హైయెస్ట్ కలెక్షన్లను రాబట్టిన చిత్రంగా 'మిర్చి' ఉండేది. 'ఉప్పెన' ఆ రికార్డుని బ్రేక్ చేసింది. రవితేజ- గోపీచంద్ మలినేని ల హ్యాట్రిక్ కాంబినేషన్లో రూపొందిన క్రాక్ చిత్రం ఫుల్ రన్లో వరల్డ్ వైడ్ గా రూ.39.16 కోట్ల షేర్ ను రాబట్టి.. రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్ మూవీగా నిలిచింది. నవీన్ పోలిశెట్టి హీరోగా అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కిన జాతి రత్నాలు ఫుల్ రన్లో ఏకంగా రూ.38.52 కోట్ల షేర్ ను రాబట్టి.. ట్రిపుల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. నాగ చైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ  ఫుల్ రన్లో రూ.35.16 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ లిస్ట్ లో చేరింది. అఖిల్- బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఫుల్ రన్లో రూ. 23.75 కోట్ల షేర్ ను రాబట్టి కమర్షియల్ హిట్ గా నిలిచింది. నాని హీరోగా రాహుల్ సాంకృత్యాన్  దర్శకత్వంలో తెరకెక్కిన శ్యామ్ సింగ రాయ్ 4 రోజులకి గాను రూ.19 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.ఫుల్ రన్లో ఈ చిత్రం రూ.25కోట్ల పైనే షేర్ ను రాబట్టి హిట్ లిస్ట్ లోకి చేరే అవకాశం ఉంది. రామ్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందిన రెడ్ సంక్రాంతి కానుకగా విడుదలై రూ.19.79 కోట్ల షేర్ ను రాబట్టింది. 


Post a Comment

0Comments

Post a Comment (0)