వికలాంగుడి కి జాబ్ ఆఫర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

Telugu Lo Computer
0


క్రియేటివిటీని, పట్టుదలతో పనిచేసేవారిని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉండే పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా ఒక వికలాంగుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఒక వికలాంగుడు మూడు చక్రాల వాహనాన్ని తయారు చేసుకుని, దానిపై పనికి వెళ్తున్న వీడియో చూసి ఆశ్చర్యపోయిన మహీంద్రా, ఆయనకు ఉద్యోగం ఆఫర్ చేశారు. కాళ్లు, చేతులు సరిగా వృద్ధి చెందని వికలాంగుడు ఓ మూడు చక్రాల జుగాడ్ బండిని నడుపుతూ, దానిపై కూర్చుకుని మాట్లాడుతున్నప్పుడు తీసిన ఒక వీడియో తాజాగా వైరల్ అయ్యింది. ఆ వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్రా ట్వీట్ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)