వణికిస్తున్న స్క్రబ్ టైఫస్ ?

Telugu Lo Computer
0


ఒమీక్రాన్ వైరస్ తో ఇప్పటికే సతమతమౌతుంటే ఇప్పుడూ స్క్రబ్ టైఫస్ కేసులు కూడా నమోదు అవుతున్నాయి. వినడానికి వింతగా ఉన్నా ఈ వైరస్ ఇప్పుడు జనాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ అనేది పురుగు కుట్టడం వల్ల వస్తుంది. మన ఇళ్లలో ఉండే మంచాలు, తడిగా ఉండే ప్రాంతాలలో ఈ పురుగులు సంచరిస్తూ ఉంటాయి. చూడడానికి ఈ పురుగులు అచ్చం నల్లి మాదిరి ఉంటాయి. రాత్రివేళల్లో ఎక్కువగా ఇవి మనకి కనపడతాయి. ఇది కుట్టడం వల్ల జ్వరం, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, ఒంటిపై దద్దుర్లు ఏర్పాడతాయి. ఒకవేళ ఈ లక్షణాలు ఉంటే చికిత్స తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 15 మందికి పైగా ఈ వైరస్ బారిన పడి చికిత్స తీసుకుంటున్నారు.  వీరిలో ఎక్కువ మందిపిల్లలే ఉన్నారు.


Post a Comment

0Comments

Post a Comment (0)