ప్రైవేట్ లే ఔట్లదారులు 5% భూమి ఇవ్వాలి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ లే ఔట్లదారులు  ఐదు శాతం భూమిని జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని ఈ మేరకు జగన్ మోహన్ రెడ్డి సర్కార్‌ ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మించే లే ఔట్లో భూమిని ఇవ్వలేకుంటే మూడు  కిలో మీటర్ల పరిధిలో అంతే విస్తీరణం కల భూమిని ప్రభుత్వానికి అప్పజెప్పాలని ఆదేశాలు జారీ చేసింది జగన్ సర్కార్‌. భూమి కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో భూమి విలువను చెల్లించవచ్చని ప్రభుత్వం సూచనలు చేసింది. లే ఔట్ల డెవలపర్ల ద్వారా వచ్చే భూమిని నగదును పేదల కోసం నిర్మించే జగనన్న కాలనీలకు వినియోగించనున్నట్టు ఈ మేరకు నిబంధనలను సవరిస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)