డిసెంబర్ 16, 17 తేదీల్లో బ్యాంకుల దేశవ్యాప్త సమ్మె

Telugu Lo Computer
0


ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిరసనగా యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) డిసెంబర్ 16, 17 తేదీల్లో సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. డిసెంబర్ 10న ఒక ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో “యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యుఎఫ్‌బియు) సమ్మె నోటీసు ఇచ్చినట్లు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (ఎల్‌బిఎ) సమాచారం అందించింది” అని ఎస్‌బిఐ తెలిపింది. సమ్మె జరుగుతున్న రోజుల్లో ఎస్బీఐ తన శాఖలు, కార్యాలయాలు సాధారణ పనితీరును నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినప్పటికీ సమ్మె కారణంగా బ్యాంక్‌లో కొన్ని పనులు నిలిచిపోయే అవకాశం ఉందని ప్రకటించింది.

16 డిసెంబర్ – బ్యాంక్ సమ్మె

17 డిసెంబర్ – బ్యాంక్ సమ్మె

18 డిసెంబర్ – యు సో సో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంకులు మూసివేస్తారు)

19 డిసెంబర్ – ఆదివారం 

ఈ వారం, సోమవారం, మంగళవారం, బుధవారాల్లో బ్యాంక్ సాధారణ వ్యాపారం ఉంటుంది. అందుకే ఈ రోజు నుంచే బ్యాంకుకు సంబంధించిన అన్ని ముఖ్యమైన పనులను పూర్తి చేసుకోండి. బ్యాంక్ సమ్మె ఆన్‌లైన్ బ్యాంకింగ్‌పై ప్రభావం చూపదు. అన్ని బ్యాంకుల డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, యథావిధిగా పని చేస్తాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)