తెలంగాణ గ్రామంలో 10 రోజుల లాక్ డౌన్

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రలో రాజన్న సిరిసిల్ల జిల్లా లోని ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో 10 రోజుల పాటు కఠిన లాక్ డౌన్ ను విధించారు. ఇటీవల ఈ గ్రామంలోకి దుబాయి నుంచి వచ్చిన వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ పాజిటివ్ తెలింది. అయితే ఆ వ్యక్తి దాదాపు అదే గ్రామంలో 62 మంది ప్రైమరీ కాంటాక్ట్స్ ఉన్నారు. అలాగే ఓమిక్రాన్ బాధితుడి భార్య కు, తల్లికి కరోనా పాజిటివ్ అని తెలింది. అయితే ఓమిక్రాన్ వేరియంట్ టెస్ట్ లకు కోసం వారి శాంపిల్స్ ను హైదరాబాద్ లోని జీనోమ్ సీక్వెన్సింగ్ పంపించారు. అయితే వాటి ఫలితాలు రావడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే ఓమిక్రాన్ బాధితుడిగా ప్రైమరీ కాంటాక్ట్ గా ఉన్న 62 మందిని అధికారులు ఇప్పటి కే హోం ఐసోలేషన్ లో ఉంచారు. అయినా.. వైరస్ వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్న నేపథ్యం లో పది రోజుల పాటు కఠిన లాక్ డౌన్ అమలు చేయాలని ఆ గ్రామ పంచాయతి నిర్ణయం తీసుకుంది. దీంతో ఆ గ్రామంలో దుకాణాలు, బడులు తో పాటు జనాలు గుంపులు గా ఉండే ప్రదేశాలన్నీ కూడా మూసివేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)