ఆస్తమా - ఉపశమనానికి చిట్కా!

Telugu Lo Computer
0


ఆస్తమా అనేది దీర్ఘకాలిక శ్వాససంబంధ రుగ్మతల్లో ఒకటి. మనం పీల్చే గాలి ఊపిరితిత్తుల్లోకి వెళ్లడానికి, బయటకు రావడానికి వాయు నాళాలు ఉంటాయి. వివిధ కారణాల వల్ల కండరాలు వాచిపోవడం వల్ల నాళాలు సన్నబడతాయి. దాంతో గాలి ప్రవాహానికి ఆటంకంగా మారుతుంది. గాలి వేగంగా పీల్చడం, వదలడం ఇబ్బందికరంగా మారుతుంది. కాసేపు నడిచినా, ఏదైనా పని చేసినా కూడా ఆయాసం వచ్చేస్తుంది. గొంతులో ఈల వేసినట్టుగా శబ్దం వస్తుంది. ఛాతిలో బిగుసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఈ రుగ్మత ఏ వయసు వారికైనా వస్తుంది. అయితే చిన్నపిల్లలు, యుక్త వయసు వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఆస్తమా ఉన్నప్పుడు డాక్టర్ సూచనలను పాటిస్తూ  ఇంటి చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. విపరీతమైన చలి, మంచు కారణంగా ఈ కాలంలో ఆస్తమా సమస్య ఎక్కువగా ఉంటుంది. 5 లవంగాలు, 7 మిరియాలు, చిన్న అల్లం ముక్క,5 తులసి ఆకులు వేసి 5 నుంచి 7 నిమిషాల పాటు పొయ్యి మీద మరిగించి గ్లాస్ లోకి వడకట్టి అరస్పూన్ తేనె కలిపి తాగాలి. ఆస్తమా తీవ్రత ఎక్కువగా ఉంటే రోజులో 2 సార్లు తీవ్రత తక్కువగా ఉంటే ఒకసారి తాగాలి. దీనిని తాగడం వలన ఆస్తమా నుండి మంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది.


Post a Comment

0Comments

Post a Comment (0)