టీఎస్ ఆర్టీసీ ఛార్జీల పెంపు ?

Telugu Lo Computer
0


కొంచెం లాభం-కొంచెం కష్టం ఫార్ములాతో తెలంగాణ ఆర్టీసీ ఛార్జీలను పెంచబోతున్నట్లు ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సంకేతాలు ఇచ్చారు. డీజిల్‌పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినందున ఏకపక్షంగా ఛార్జీల పెంపు ఉండబోదన్నారు. ఆర్టీసీ ఛార్జెస్ హైక్‌పై మంత్రి పువ్వాడ రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఛార్జీల పెంపుపై మరోసారి ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ ఆమోదం తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెరగనున్నాయ్. ఆర్టీసీ ఛార్జీలు పెంచాలంటూ గతంలోనే ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపారు. అయితే, కేంద్రం డీజిల్‌పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడంతో ప్రపోజల్స్‌లో మార్పులు చేశారు. సామాన్య ప్రజలపై భావరం పడకుండా పల్లె వెలుగు ఛార్జీలపై పెంపును కొంచెం తగ్గించారు. మిగతా అన్ని సర్వీసులపైనా ఛార్జీలు మోస్తరుగా పెరగనున్నాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)