గ్యాస్ సమస్య - ఇంటి వైద్యం - తెలుగు లో ఇంటర్నెట్ : UPDATE NEWS

Breaking

Ad

Post Top Ad

TELUGU LO COMPUTER NEWS

Visit telugulocomputer.blogspot.com!

Post Top Ad

adg

Thursday, 11 November 2021

గ్యాస్ సమస్య - ఇంటి వైద్యం

  

 

గ్యాస్ సమస్య అనేది వచ్చిందంటే చాలా ఇబ్బందిగా ఉండటమే కాకుండా అట్టే తగ్గదు. గ్యాస్ సమస్య రాగానే మనలో చాలా మంది మందులు వేసుకుంటారు. అలా కాకుండా ఇంటి చిట్కాల ద్వారా తగ్గించుకోవచ్చు. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి. దీని కోసం ఉపయోగించే అన్ని దినుసులు ఇంటిలో అందుబాటులో ఉండేవే. అరస్పూన్ ధనియాలు, అరస్పూన్ జీలకర్ర, అరస్పూన్ సొంపు, 3 మిరియాలు, చిన్న అల్లం ముక్కలను కొంచెం దంచుకొని పక్కన పెట్టాలి. మరి మెత్తగా చేయవలసిన అవసరం లేదు. పొయ్యి వెలిగించి గిన్నె పెట్టి ఒక గ్లాస్ నీటిని పోసి దానిలో తయారు చేసుకున్న ధనియాల మిశ్రమాన్ని వేసి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించాలి. మరిగాక గ్లాస్ లో వడకట్టి తాగాలి. గ్యాస్ సమస్య ఉన్నప్పుడు ఉదయం, సాయంత్రం అరగ్లాస్ తాగితే మంచి ఉపశమనం కలుగుతుంది. దీనిని గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ఈ విధంగా 3 రోజులు తాగితే గ్యాస్ సమస్య నుండి మంచి ఉపశమనం కలుగుతుంది. అయితే గ్యాస్ సమస్య ఎక్కువగా ఉంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించి డాక్టర్ సూచనల ప్రకారం ఫాలో అవుతూ ఇంటి చిట్కా పాటిస్తే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది.ఈ డ్రింక్ తాగటం వలన గ్యాస్ సమస్య తగ్గటమే కాకుండా అధిక బరువు సమస్య ఉన్నవారికి కూడా చాలా మంచి ప్రయోజనం కనపడుతుంది. అంతేకాకుండా డయబెటిస్ ఉన్నవారికి కూడా రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.


No comments:

Post a Comment