19న ఆకాశంలో అద్భుతం...!

Telugu Lo Computer
0


ఈ శతాబ్దంలోనే అత్యంత సుదీర్ఘమైన చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఇది పాక్షిక చంద్రగ్రహణమే అయినా ఏకంగా 3 గంటల 28 నిమిషాల పాటు కనువిందు చేయనుంది. ఇది భారత్ లోనూ కనిపిస్తుంది. ఈశాన్య రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం తదితర ప్రాంతాల్లో దీనిని  చూడొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 18,19 తేదీల్లో వివిధ సమయాల్లో ఈ గ్రహణం కనిపిస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. భారత కాలమానం ప్రకారం నవంబర్ 19న మధ్యాహ్నం ఒంటి గంట 30 నిమిషాలకు చంద్రుడు, సూర్యుడికి మధ్య భూమి ఒకే వరుసలో వచ్చి భూమి నీడ అసంపూర్తిగా చంద్రుడిపై పడి పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడనుంది. ఈ పాక్షిక చంద్రగ్రహణాన్ని ఉత్తర అమెరికా ఖండంలోని దేశాల వారు పూర్తిగా వీక్షించొచ్చు. అంతేకాదు, మెక్సికోలోనూ ఇది దర్శనమిస్తుంది. దీన్ని ఫ్రాస్ట్ మూన్ (మంచుతో కప్పబడిన చంద్రుడు) అని పిలుస్తారని నాసా వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాదికి ఇదే చివరి చంద్రగ్రహణం. గ్రహణం సమయంలో చంద్రుని ఉపరితలం మొత్తం 97 శాతం ఎర్రగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు ఎవరికీ కనిపించకుండా ఈ పాక్షిక గ్రహణం దాచేస్తుంది. ఈ ఏడాది తొలి చంద్ర గహణం మే 26 రోజున ఏర్పడింది. నిండు చంద్రుడు ఆ రోజు అరుణ వర్ణంలో కనువిందు చేశాడు. దీన్నే బ్లడ్‌ మూన్, సూపర్ మూన్ అని పిలుస్తారు.

Post a Comment

0Comments

Post a Comment (0)