తెలంగాణాలో 2,620 కి పెరగనున్న వైన్ షాపులు

Telugu Lo Computer
0


మద్యం వినియోగదారుల నుంచి వీలైనంత ఎక్కువ డబ్బులు గుంజేందుకు సిద్ధమైంది. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా159 బార్లకు పర్మిషన్‌ ఇవ్వగా ఇప్పుడు అందరికీ అందుబాటులో ఉండేలా మరిన్ని వైన్​ షాపులను తీసుకొస్తోంది. కొత్తగా 404 వైన్స్‌కు పర్మిషన్‌ ఇచ్చినట్లు తెలిసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం వైన్స్​ సంఖ్య 2,620కి చేరనుంది. కొత్త మండలాలతో పాటు మరికొన్ని చోట్ల మద్యం దుకాణాలు తీసుకురానున్నారు. రాష్ట్రంలో ప్రతి రెండేండ్లకోసారి ఎక్సైజ్‌ పాలసీ మారుతుంటుంది. ఈ ఏడాది అక్టోబర్‌ నెలతో పాలసీ ముగిసినా దీన్ని ఈ ఏడాది నవంబర్‌ ఆఖరు వరకు పొడిగించారు. డిసెంబర్‌ ఒకటి నుంచి కొత్త పాలసీ అమల్లోకి రానుంది. ఈ నేపథ్యంలో శనివారం పాలసీకి సంబంధించి నోటిఫికేషన్​ను ప్రభుత్వం విడుదల చేసింది. వైన్స్​ కేటాయింపు ప్రాసెస్​కు వచ్చే వారం తేదీలతో కూడిన నోటిఫికేషన్​ ఇవ్వనున్నట్టు తెలిసింది. ఈ నెల 9 నుంచి అప్లికేషన్ల స్వీకరణ, 16 వరకు దరఖాస్తులకు గడువు, 18న డ్రా తీయనున్నట్టు సమాచారం.

Post a Comment

0Comments

Post a Comment (0)